డయేరియాపై ప్రభుత్వం అలర్ట్

డయేరియాపై ప్రభుత్వం అలర్ట్

NTR: విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కలకలం రేగింది. చవితి భోజనాల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా పలువురు బుధవారం అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బోండా ఉమ పరామర్శించారు. కలెక్టర్ లక్ష్మీశ తెలిపిన వివరాల ప్రకారం, 22 మంది డిశ్చార్జ్ అయ్యారు. 41 మందికి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.