తహసీల్దార్ కార్యాలయంలో పాము కలకలం

తహసీల్దార్ కార్యాలయంలో పాము కలకలం

NGKL: ఊర్కొండ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం పాము కలకలం రేపిన సంఘటన చోటుచేసుకుంది. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం కార్యాలయం తాళాలు తీసి ఊడ్చే ప్రయత్నం చేస్తుండగా పాము కనిపించిందని అన్నారు. దాంతో భయపడి తోటి ఉద్యోగులకు తెలియజేయగా వారు వచ్చి రికార్డులను బయటపెట్టి పామును వేతకగా పాము గదిలో ఉన్న రంద్రంలోకి వెళ్లిందని తెలిపారు.