జూద శిబిరంపై పోలీసుల దాడి

W.G: తాడేపల్లిగూడెం మండలం మెట్ట ఉప్పరగూడెంలో జూదం ఆడుతున్నారన్న సమాచారంతో రూరల్ ఎస్సై జేవీఎన్ ప్రసాద్ తన సిబ్బందితో శుక్రవారం దాడి చేశారు. మొత్తం ఎనిమిది మందికి గాను ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.28, 200లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్సై ప్రసాద్ వివరించారు. వారిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.