పల్లెల్లో నామినేషన్ల సందడి

పల్లెల్లో నామినేషన్ల సందడి

KMM: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ నిన్న మొదలైంది. KMM జిల్లాలో 192 పంచాయతీలకు తొలి విడతలో ఎన్నికలు జరుగుతుండగా సర్పంచి స్థానాలకు 100, వార్డు స్థానాలకు 49 నామపత్రాలు దాఖలయ్యాయి. ఏర్పాటు చేసిన కేంద్రాల్లో నామపత్రాలను ROలు స్వీకరించారు. ఆ కేంద్రాలకు 100 మీ. దూరంలో పోలీసుల బందోబస్తు చేపట్టారు. ఓ అభ్యర్థి వెంట ముగ్గురిని మాత్రమే లోపలికి అనుమతిచ్చారు.