సంక్షేమ పథకాలు కొనసాగాలంటే సీఎం జగన్ రావాలి: శ్రీధర్

అనంతపురం: ఓబులదేవరచెరువు మండలం టి.కుంట్లపల్లి పంచాయితీలో పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దకుంట శ్రీధర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రజలను కోరారు.