VIDEO: కాలువలోకి దూసుకెళ్లిన టిప్పర్

VIDEO: కాలువలోకి దూసుకెళ్లిన టిప్పర్

W.G: మొగల్తూరు మండలం జగన్నాథపురం కాలువ మొగ వద్ద శనివారం తెల్లవారుజామున ఒక టిప్పర్ లారీ ప్రమాదానికి గురైంది. గ్రావెల్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.