నూతన సొసైటీ ఛైర్మన్ ప్రమాణస్వీకారం

ELR: కామవరపుకోట మండలం తడికలపూడి సొసైటీ ఛైర్మన్‌గా తాత బాలాజీ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. సొసైటీ డైరెక్టర్లుగా సుజాత రావు, మోహనరావు బాధ్యతలు స్వీకరించారు. అలాగే సొసైటీ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.