'హాకీ శతాబ్ది వేడుకల' గోడపత్రికను ఆవిష్కరించిన కలెక్టర్
కృష్ణా: భారతదేశంలో హాకీ క్రీడ ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా. జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో “హాకీ శతాబ్ది వేడుకల” గోడ పత్రికను సోమవారం జిల్లా కలెక్టర్ బాలాజీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవీన్, జిల్లా క్రీడాధికారి, జిల్లా హాకీ అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.