మంత్రి సుభాష్‌ను అభినందించిన సీఎం

మంత్రి సుభాష్‌ను అభినందించిన సీఎం

కోనసీమ: మొంథా తుఫాన్ ముందస్తు చర్యలతో పాటు, సహాయక చర్యల్లో ముందుండి సేవలందించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను ప్రశంసిస్తూ సీఎం చంద్రబాబు పురస్కారాన్ని అందించి సత్కరించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో శనివారం జరిగిన అభినందన కార్యక్రమంలో జిల్లాలోనే కాకుండా కృష్ణా జిల్లా ఇంఛార్జి మంత్రిగా సుభాష్ చురుగ్గా వ్యవహరించారని చంద్రబాబు ప్రశంసించారు.