VIDEO: 'దొంగ కేసులు పెట్టి అక్రమంగా జైలుకు పంపుతున్నారు'
NLR: YCP నేతలపై దొంగ కేసులు పెట్టి అక్రమంగా జైలుకు పంపుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడిని ములాఖాత్ ద్వారా కలిశారు. అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. అనంతరం కాకాణి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు.