మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. CP కీలక సూచనలు

మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. CP కీలక సూచనలు

WGL: మొంథా తుఫాను తీవ్రత దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉమ్మడి జిల్లా ప్రజలను హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. చెరువులు మత్తడి పడే అవకాశం, వాగులు పొంగే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. వాగులు దాటవద్దని, రోడ్డుపై గుంతలు గమనించి నడవాలని సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కి ఫోన్ చేయాలని కోరారు