VIDEO: అయ్యన్నపేటలో పర్యటించిన జేసీ
విజయనగరం పట్టణంలోని అయ్యన్నపేటలో జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ మంగళవారం పర్యటించారు. ప్రజా అవసరాల కోసం భూమి కేటాయింపునకు సంబంధించి సర్వే నెంబర్ 94 భూమిని ఆయన పరిశీలించారు. రెవిన్యూ డివిజనల్ అధికారి ఎస్. సుధాసాగర్, తహసీల్దార్ కూర్మనాధరావు ఈ ప్రతిపాదిత స్థలం వివరాలను జేసీకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.