గృహాలు నిర్మించుకున్న 50 లబ్ధిదారులకు బిల్లులు రాలేదు
ELR: గృహాలు నిర్మించుకొని సంవత్సరాలు దాటుతున్న నేటికీ బిల్లులు రాలేదని నీలాద్రి పురం సర్పంచ్ చదలవాడ రాజేంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం ఉంగుటూరులో జరిగిన మండల సమావేశం ఆయన హౌసింగ్ ఏ ఈ సతీష్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో 50 మంది లబ్ధిదారులకు గృహ బిల్లులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని సమావేశం పేర్కొన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.