వాహన తనిఖీలు నిర్వహించిన అధికారులు

VZM: ఎస్ కోట నుండి కొత్తవలస వెళ్లే రహదారిలో పలుచోట్ల సోమవారం ఆర్టీసీ డిపో మేనేజర్ కె.రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. 115 వాహనాలను ఏఎంవిఐ ఉష ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఇందులో వాహన పత్రాలు సరిగా లేని 11 వాహనాలపై కేసు నమోదు చేసి, 8 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే రూ.1,20,000 అపరాధ రుసుము విధించినట్లు తెలిపారు.