చింతపల్లిలో సాయుధ పోరాట వారోత్సవాలు

NLG: చింతపల్లి(M)ఘడియాగౌరారంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈనెల 11 నుంచి 27 వరకు CPI ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వారోత్సవాల్లో భాగంగా సాయుధ పోరాట యోధుల స్థూపాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి, యాదగిరి రావు తదితర నాయకులు పాల్గొన్నారు.