చీదేళ్ల జాతరలో ఫ్లెక్సీల కలకలం
SRPT: పెన్ పహాడ్ మండలం చీదేళ్ల గ్రామంలోని తిరుపతమ్మ జాతరలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫ్లెక్సీని దుండగులు చించివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. కొత్త ప్రభుత్వం వచ్చిన కొద్దిరోజులకే ఇలాంటి అరాచకాలు చేయడం దారుణమని మాజీ సర్పంచ్ సీతారాంరెడ్డి మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.