లబ్ధిదారులకు CMRF చెక్కులు అందజేత

లబ్ధిదారులకు CMRF చెక్కులు అందజేత

E.G: ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను (APSSDC) ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు శనివారం పంపిణీ చేశారు. ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో నియోజకవర్గంలోని 37 మంది లబ్ధిదారులకు రూ. 15,68,200 విలువైన చెక్కులను అందజేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ, ఇన్సూరెన్స్ పథకాలు వర్తించని వారికి వైద్య సేవ నిమిత్తం ఈ సాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.