దొర్నిపాడులో సీపీఎం నాయకులు నిరసన

దొర్నిపాడులో సీపీఎం నాయకులు నిరసన

NDL: దొర్నిపాడు మండల కేంద్రంలో ఇవాళ సీపీఎం నాయకులు రమేష్ కుమార్, సుధాకర్ కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దొర్నిపాడుకు చెందిన మహేశ్వర్ రెడ్డి, రాజారెడ్డి రామిరెడ్డి కలిసి హెల్త్ అండ్ వెల్త్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆరోపిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు వారు వెల్లడించారు.