'చేతి వృత్తుల వారిని ప్రభుత్వం ఆదుకోవాలి'

'చేతి వృత్తుల వారిని ప్రభుత్వం ఆదుకోవాలి'

తూ.గో: చేతివృత్తుల వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అయినవిల్లి ఎమ్మార్వో సీహెచ్ లక్ష్మమ్మకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. రెడీమేడ్ వస్తువులు అందుబాటులోకి రావడం వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని తమను అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని చేతి వృత్తుల సంఘం జిల్లా అధ్యక్షులు దేవాదుల సత్యనారాయణ డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.