జలహారతికి సీఎంను ఆహ్వానించిన మడకశిర ఎమ్మెల్యే

జలహారతికి సీఎంను ఆహ్వానించిన మడకశిర ఎమ్మెల్యే

సత్యసాయి: హంద్రీనీవా ద్వారా కృష్ణాజలాలతో మడకశిర నియోజకవర్గంలోని చెరువులు నిండుతున్నాయి. చరిత్రలో తొలిసారిగా అమరాపురం చెరువుకు నీరు చేరింది. ఈ సందర్భంగా డిసెంబరులో జరగనున్న జలహారతికి రావాలని సీఎం చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆహ్వానించారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.