ఏవీటీ ఆల్ టెరైన్ వెహికల్ నడుపుతున్న శ్రీకాకుళం ఆర్డీవో

ఏవీటీ ఆల్ టెరైన్ వెహికల్ నడుపుతున్న శ్రీకాకుళం ఆర్డీవో

SKLM: బారువ సముద్రపు ఒడ్డున బీచ్ ఫెస్టివల్లో భాగంగా శనివారం శ్రీకాకుళం ఆర్డీవో ప్రత్యూష ఏవిటి ఆల్టరైన్ వెహికల్‌ను నడిపారు. బీచ్ ఫెస్టివల్లో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పలు వర్గాలకు చెందిన వ్యక్తులు సందడి చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు, డివిజనల్ స్థాయి అధికారులు సైతం వివిధ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఆర్డీఓ వెహికల్ నడపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.