డిపోలో 'డయల్ యువర్ డీఎం'

డిపోలో 'డయల్ యువర్ డీఎం'

SRD: సంగారెడ్డి డిపోలో నిర్వహించిన 'డయల్ యువర్ డీఎం'లో డిపో మేనేజర్ ఉపేందర్‌కు పలువురు విజ్ఞప్తులు చేశారు. ఎద్దుమైలారం-శంకర్ పల్లి రూటులో బస్సులు పెంచాలని కోరారు. అలాగే సంగారెడ్డి నుంచి నిర్మల్, రామాయంపేట, యాదగిరిగుట్ట, హనుమకొండకు కొత్త సర్వీసులు నడపాలని విన్నవించారు. ప్రజల సమస్యలను విన్న డీఎం, రద్దీని బట్టి అదనపు బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.