పేద విద్యార్థి చదువుకు అండగా గ్రామస్తులు

కరీంనగర్: మానకొండూర్ మండలం గంగిపల్లికి చెందిన మార మహేష్ ఎంతో కష్టపడి చదివి తిరుచ్చిలోని NIT క్యాంపస్‌లో సీటు సాధించాడు. అయితే, ఆ క్యాంపస్‌లో జాయిన్ అవ్వాలంటే ఖర్చుతో కూడుకున్న పని. మహేష్ కుటుంబం ఆర్థికంగా వెనకబడడంతో విషయం తెలుసుకున్న గ్రామస్థులు కొంత డబ్బులు పోగు చేసి, దాతల సహాయంతో మహేష్ చదువుకై ల్యాప్‌టాప్‌ను అందజేశారు.