మెగా జాబ్ మేళా.. 2000 మందికి ఉద్యోగాలు
BHPL: నిరుద్యోగ యువత ఆశాకిరణంగా నిలుస్తున్న సింగరేణి మెగా జాబ్ మేళాలు ఘన విజయం సాధిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన పలు ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు, BHPL సింగరేణి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జాబ్ మేళాలో 3,500 మంది అభ్యర్థులు పాల్గొనగా, 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. స్థానిక ప్రాంత యువతీ యువకులకు ప్రాధాన్యత ఇవ్వడంతో విశేష స్పందన లభించింది.