'ఇళ్ల పట్టాలను తక్షణమే పంపిణీ చేయాలి'

'ఇళ్ల పట్టాలను తక్షణమే పంపిణీ చేయాలి'

ATP: రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల పట్టాలను తక్షణమే పంపిణీ చేయాలని సీపీఐ తాలూకా కార్యదర్శి నాగార్జున డిమాండ్ చేశారు. గుమగట్ట మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు లబ్ధిదారులతో కలిసి నిరసనలు వ్యక్తం చేశారు. వెంటనే లబ్ధిదారులకు న్యాయం చేయకపోతే ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు.