మానవ హక్కుల పరిరక్షణపై వ్యాసరచన పోటీలు
AKP: కసింకోట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థినులకు మానవ హక్కుల పరిరక్షణపై వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు హెచ్ఎం స్వర్ణ కుమారి తెలిపారు. విద్యార్థులకు ముందుగా మానవ హక్కులపై అవగాహన కల్పించామన్నారు. ప్రతి ఒక్కరూ మానవ హక్కుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.