VIDEO: వాడపల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు
కోనసీమ: తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామి క్షేత్రానికి శనివారం భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఏడు వారాల నోము నోచుకున్న భక్తులు మాడ వీధుల్లో ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగింది. భక్తులకు ఇబ్బంది లేకుండా సిబ్బంది ఏర్పాటు చేశారు.