చెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి

చెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి

నిజామాబాద్ రూరల్ మండలం ముత్తకుంటలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు స్వామి గౌడ్ శనివారం కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చరికి తరలించారు.