VIDEO: స్వేచ్ఛగా లంక గ్రామాలకు ప్రయాణం

VIDEO: స్వేచ్ఛగా లంక గ్రామాలకు ప్రయాణం

కృష్ణా: కృష్ణానది పాయల వద్ద వరద ఉధృతి తగ్గు ముఖం పట్టింది. తోట్లవల్లూరు మండలంలోని గత కొన్ని రోజులుగా లంక గ్రామాల ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు పడవల సాయంతో స్వేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నారు. రేవుల వద్ద అధికారులు విధించిన ఆంక్షలు ఎత్తివేయడంతో గ్రామాల్లో ఉపశమనం నెలకొంది. వరద ప్రభావం తగ్గడంతో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.