పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌‌ను పరిశీలించిన ఎస్పీ

పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌‌ను పరిశీలించిన ఎస్పీ

GNTR: గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్‌లోని పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌ను ఆదివారం రాత్రి ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించి పలు అంశాలను సమీక్షించారు. స్టేషన్ పరిసరాల శుభ్రత, భద్రత, రికార్డుల సమగ్రమైన నిర్వహణ, ప్రజల కోసం సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడం వంటి విషయాలపై సూచనలు ఇచ్చారు. అలాగే విజిబుల్ పోలీసింగ్, రాత్రి గస్తీలు నిర్వహించాలని తెలిపారు.