VIDEO: రోడ్డు భద్రత వారోత్సవాల్లో ద్విచక్ర వాహన ర్యాలీ
వరంగల్ జిల్లాలో రోడ్ సురక్ష అభయాన్–2026 నినాదంతో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు. బుధవారం ఆర్టీవో ఆఫీస్ కూడలి నుంచి ఎంజీఎం కూడలి వరకు ద్విచక్ర వాహనాలతో రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ చేపట్టారు. ర్యాలీని డీసీపీ శివప్రసాద్, ఆర్టీఏ అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ద్విచక్ర వాహన ర్యాలీలో పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.