తుమ్మండలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం
నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగర వేసింది. ఈ గ్రామంలో 10 వార్డులకు 9 వార్డులు కాంగ్రెస్ గెలవగా, ఒకటి మాత్రమే BRS గెలిచింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బుర్రి వెంకటేశ్వర్లు యాదవ్ BRS పార్టీ అభ్యర్థి రావుల లింగయ్యపై 690 ఓట్ల భారీ మేజారిటితో గేలుపొందాడు. తనకు ఓటు వేసి గెలిపించిన గ్రామప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.