భారతి సిమెంట్ మేనేజర్‌పై కేసు నమోదు
AP: మాజీ సీఎం జగన్ హయాంలో భారతి సిమెంట్ మేనేజర్ భార్గవ్ రెడ్డి భూముల విషయంలో మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కడపకు చెందిన మహబూబ్‌ఖాన్ దగ్గర రూ.60 లక్షలు అడ్వాన్స్ తీసుకుని మొహం చాటేసినట్లు తెలుస్తోంది. మహబూబ్‌ఖాన్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు భార్గవ్‌రెడ్డిపై సీకే దిన్నె పోలీసులు కేసు నమోదు చేశారు.