ఆగన్న ఆకస్మిక మృతిపై కవ్వంపల్లి సంతాపం
KNR: ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కళ్యాడపు ఆగయ్య మరణంపై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణ విచారం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించే నాయకులు అరుదని, అందులో ఆగయ్య ఒకరని, మృతితో ఆ పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందన్నారు.