'నిధులను కూలీల ఖాతాల్లో జమ చేయాలి'

AKP: ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.961 కోట్లను తక్షణ కూలీల ఖాతాల్లో జమ చేయాలని సీపీఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అప్పలరాజు డిమాండ్ చేశారు. సోమవారం వేతన బకాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. అప్పలరాజు మాట్లాడుతూ సకాలంలో కూలి డబ్బులు అందకపోవడంతో పలు అవస్థలు పడుతున్నట్లు పేర్కొన్నారు.