పట్టుబడుతున్న జీవీఎంసీ కార్పొరేటర్‌లు
విశాఖ జీవీఎంసీ కార్పొరేటర్‌లు మరోసారి స్టడీ టూర్ నిర్వహించాలని కోరుతున్నారు. ఈనెల 17తో పాలకవర్గం పదవీకాలం ముగియనుండటంతో కనీసం ఒకసారి అధ్యయన యాత్రకు అనుమతి ఇవ్వాలని మేయర్, కమిషనర్‌ను కోరారు. ఐదేళ్లలో నాలుగేళ్లు మాత్రమే యాత్రలు జరిగాయని, ఈనెల 10 నుంచి 14 వరకు టూర్ ఏర్పాటు చేయాలని సూచించారు.