విశాఖ ఉక్కుకు ద్రోహం: సీపీఎం

VSP: అనకాపల్లిలో అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం టీడీపీ ఎంపీలు చేస్తున్న ప్రయత్నాలను సీపీఎం తీవ్రంగా ఖండించింది. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని కోరకుండా, మిట్టల్ సంస్థకు గనుల కేటాయింపును వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరడం ద్రోహమని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు విమర్శించారు.