మంగళగిరిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
GNTR: జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆకస్మికంగా పర్యటించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్య పరిస్థితులు, ప్రజా సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. క్యాంటీన్‌ను సందర్శించిన కలెక్టర్ ఆహారం నాణ్యత, వంటశాల పరిశుభ్రత, సిబ్బంది నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు.