బోరు ఎండిపోవడంతో గ్రామస్తులు నీటి అవస్థలు

చిత్తూరు: కుప్పం మండలం అడవి ములకలపల్లిలోని ప్రభుత్వ తాగునీటి బోరు ఎండిపోయినట్లు స్థానికులు తెలిపారు. దీంతో తీవ్ర నీటి సమస్య ఏర్పడిందన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. గ్రామంలో సుమారు 70 కుటుంబాలు ఉన్నాయని, నీటి కోసం ఎంతో అవస్థలు పడుతున్నామని వారు పేర్కొన్నారు.