'జన నాయగన్' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'జన నాయగన్'. ఈ సినిమా 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. దళపతి కచేరీ అంటూ సాగుతున్న ఈ పాట ఆకట్టుకుంటుంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా, మమితా బైజు కీలక పాత్రలో కనిపించనున్నారు.