ఆళ్లగడ్డ రోడ్లపై మోకాళ్లలోతు వరద నీరు
NDL: భారీ వర్షాల కారణంగా ఇవాళ ఆళ్లగడ్డ మండలం పడకండ్ల గ్రామ శివారుల్లోని రోడ్లు జలమయమయ్యాయి. అహోబిలం వెళ్లే రహదారిపై వరదనీరు మోకాళ్ల లోతుగా నిలిచిపోయింది. కాలువలు చెత్తతో నిండిపోవడంతో శారదా నగర్, వెంకటేశ్వర ఆలయం వద్ద నీరు రోడ్డుపైకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.