మహిషాసుర మర్దిని అలంకారంలో పోలేరమ్మ

NLR: మనుబోలు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవాలయం నందు దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకొని శుక్రవారం పోలేరమ్మ అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అందరూ విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు .అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.