కంచికచర్లలో దంచి కొట్టిన వర్షం

కంచికచర్లలో దంచి కొట్టిన వర్షం

NTR: కంచికచర్లలో ఆదివారం ఉదయం అకాల వర్షం దంచి కొట్టింది. వారం రోజులుగా 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత నమోదవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పట్టణ వాసులు నేడు కురుస్తున్న వర్షంతో సేద తీరుతున్నారు. భారీ వర్షం దాటికి రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. పలుచోట్ల డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి.