జగిత్యాల మాస్టర్ ప్లాన్‌కు మళ్లీ కసరత్తు

జగిత్యాల మాస్టర్ ప్లాన్‌కు మళ్లీ కసరత్తు

జగిత్యాల: నగర మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు మళ్లీ కదలిక వచ్చింది. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి అధికారులు ప్రపోజల్స్ కూడా సిద్ధం చేస్తున్నారు. రెండేండ్ల కింద రైతుల ఆందోళనలతో మాస్టర్ ప్లాన్-2041 ఆగిపోయిన విషయం తెలిసిందే. మళ్లీ ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా మాస్టర్ ప్లాన్ అమలు చేసే దిశగా ఆఫీసర్లు కసరత్తు చేపట్టారు.