VIDEO: ఘనంగా గోదావరి మాత మహా హారతి

VIDEO: ఘనంగా గోదావరి మాత మహా హారతి

JGL: ధర్మపురిలోని గోదావరి నదీ తీరంలో స్థానిక లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో నిన్న సాయంత్రం గోదావరి మహా హారతి కార్యక్రమాన్ని అర్చకులు అత్యంత ఘనంగా నిర్వహించారు. అర్చకులు, దేవస్థాన అధికారులు, ఆలయ పాలకమండలి ఛైర్మన్, సభ్యులు, భక్తులు ఆలయం నుంచి మంగళవాయిద్యాలు, మహిళలు మంగళహారతులతో గోదావరి నదీ తీరాన మహా హారతి సమర్పించారు.