ఈ నెల 21న ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

ఈ నెల 21న ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

BHPL: జిల్లా కేంద్రంలోని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 21న భూపాలపల్లిలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి ఎస్. శ్యాంసుందర్ శనివారం తెలిపారు. కృష్ణ కాలనీలోని సీఈఆర్ క్లబ్‌లో శిబిరం కొనసాగుతుంది. డా. విశ్వనాధ మహర్షి నేతృత్వంలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత సలహాలు అందిస్తారు.