ప్రజా సేవల్లో సంతృప్తి పెరగాలి: కలెక్టర్
కర్నూలు: ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్‌లో సంతృప్తి శాతం తప్పనిసరిగా పెరగాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులకు సూచించారు. ప్రజల అర్జీలు మర్యాదపూర్వకంగా, నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఆమె స్పష్టం చేశారు. హౌసింగ్, రెవెన్యూ సేవలు, ఐవీఆర్ఎస్, దేవాదాయ-వక్ఫ్ అంశాలపై ఆర్డీవోలు, తహశీల్దార్లు, సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.