నిర్మాతగా కిరణ్ అబ్బవరం మరో చిత్రం

నిర్మాతగా కిరణ్ అబ్బవరం మరో చిత్రం

హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మరో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే అతడు నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే చిత్రం ఈనెల 17న విడుదల కానుంది. ఇప్పుడు ‘రియాలిటీ’ అనే టైటిల్‌తో ఓ సినిమాను రూపొందించడానికి రెడీ అయ్యాడు. వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.