VIDEO: 'ఉచిత టైలరింగ్ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి'

ప్రకాశం: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో ఉచిత టైలరింగ్ శిక్షణ ఇస్తున్నట్లు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కృష్ణారావు తెలిపారు. మార్కాపురం బీజేపీ పార్టీ కార్యాలయంలో కృష్ణారావు మాట్లాడుతూ... పురపాలక సంఘ పరిధిలోని మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణతోపాటు కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన మహిళలు స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.