'మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ఎనలేని కృషి'

KMM: మహిళల సంక్షేమంతో పాటు ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అన్నారు. సోమవారం ఖమ్మంలోని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌజన్య ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలకు న్యాయం జరగాలి అంటే కాంగ్రెస్తోనే అని అన్నారు.